ఏంటీ వర్షం..బీభత్సం కాదు కాదు..అతి బీభత్సమైన వాన

ఏంటీ వర్షం..బీభత్సం కాదు కాదు..అతి బీభత్సమైన వాన

ఏంటీ వర్షం...ఏంటీ వాతావరణం.. గంట ముందు ఒకలా ఉంటుంది. గంట తర్వాత  మరో పరిస్థితి. సెప్టెంబర్ 25వ తేదీన మధ్యాహ్నం 2 గంటల వరకు హైదరాబాద్ వ్యాప్తంగా నార్మల్ గా ఉన్న వాతావరణం.. 2 దాటిన తర్వాత ఒక్కసారిగా మారిపోయింది. సిటీ వ్యాప్తంగా కుండపోతగా వాన కురుస్తోంది. భారీ వర్షానికి సిటీలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. 

జూబ్లిహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, బేగంపేట్, అమీర్ పేట్, ఎస్ఆర్ నగర్, మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, మెహదీపట్నం, లక్డికాపూల్, కోటి, దిల్ సుఖ్ నగర్, బేగంబజార్, చార్మినార్, రాణిగంజ్, ప్యాట్నీ, ప్యారడైజ్, సుచిత్ర, జీడిమెట్ల, చింతల్, బాల్ నగర్, కూకట్ పల్లి వంటి అనేక ప్రాంతాల్లో వర్షం దంచికొడుతోంది. 

హైదరాబాద్ లోని ముఖ్యమైన ప్రాంతాల్లో వర్షం కురుస్తుండటంతో రోడ్లపై నీరు నదులను తలపిస్తోంది. గుంతల్లో నీరు నిలిచిపోయింది. దీంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వాహనదారులు, బస్సుల్లోని ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.