వరుణ దేవా కరుణించవయ్యా: ఎడ్జ్‎బాస్టన్‎లో భారీ వర్షం.. ప్రారంభంకాని రెండో టెస్ట్

వరుణ దేవా కరుణించవయ్యా: ఎడ్జ్‎బాస్టన్‎లో భారీ వర్షం.. ప్రారంభంకాని రెండో టెస్ట్

బ్రిటన్: ఇండియా, ఇంగ్లాండ్ మధ్య జరుగుతోన్న రెండో టెస్ట్ ఐదో రోజు మ్యాచ్‎కు వరుణుడు అంతరాయం కలిగించాడు. రెండో టెస్ట్ జరుగుతోన్న బర్మింగ్‎హామ్‎లోని ఎడ్జ్‎బాస్టన్ స్టేడియం పరిసరాల్లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో షెడ్యూల్ ప్రకారం మ్యాచ్ ప్రారంభం కాలేదు. గ్రౌండ్ సిబ్బంది స్టేడియం మొత్తం కవర్లు కప్పారు. వర్షం ఇలాగే కంటిన్యూ అయితే మ్యాచ్ ప్రారంభం మరింత ఆలస్యం అయ్యేలా ఉంది. 

ఆదివారం (జూలై 6) ఎడ్జ్‎బాస్టన్‎లో 60 శాతం వర్షం కురిసే అవకాశం ఉందని అక్కడి వాతావరణ శాఖ హెచ్చరించిన విషయం తెలిసిందే. 
వర్షం తగ్గకుండా ఇలాగే పడితే మ్యాచ్ డ్రా అవుతోంది. వర్షం కంటిన్యూగా కురిస్తే మ్యాచ్ అఫిషియల్స్ దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. భారత బ్యాటర్లు, బౌలర్లు సమిష్టిగా రాణించడంతో రెండో టెస్ట్‎లో టీమిండియా విజయం దిశగా వెళ్తుంది. విజయానికి చివరి రోజు ఇండియాకు 7 వికెట్లు అవసరం కాగా.. అతిథ్య ఇంగ్లాండ్‎ 536 పరుగులు చేయాలి. 

608 రన్స్‌‌ టార్గెట్ ఛేజింగ్‌‌‏లో ఇంగ్లాండ్ 72/3తో ఇంగ్లండ్ ఎదురీదుతోంది. ప్రస్తుతం క్రీజులో -ఓలీ పోప్ (24), హ్యారీ బ్రూక్ (15) ఉన్నారు. ఎడ్జ్‎బాస్టన్‎లో చరిత్ర సృష్టించేందుకు భారత్‎కు మరో 7 వికెట్లు అవసరం. రెండో టెస్టులో భారత్ విజయం దాదాపు ఖరారు కాగా ఈ సమయంలో వర్షం కురుస్తుండటంతో భారత అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. వర్షం తగ్గాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. క్రీడావర్గాల సమాచారం ప్రకారం లంచ్ బ్రేక్ తర్వాత నేరుగా మ్యాచ్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.