
కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా శనివారం వర్షం దంచి కొట్టింది. కరీంనగర్ సిటీలో గంటకు పైగా కుండపోతగా వాన కురిసింది. దీంతో డ్రైనేజీల్లో నీళ్లు నిండి రోడ్లపై నుంచి వెళ్లాయి. ముకరంపుర, సెయింట్ జాన్స్ స్కూల్, రాంనగర్, కలెక్టరేట్, కార్ఖానగడ్డ, సుభాష్ నగర్ తదితర ఏరియాల్లో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి.
డ్రైనేజీల్లోకి నీరు చేరగా అందులోంచి ప్లాస్టిక్ వస్తువులు, చెత్తాచెదారం రోడ్డుపై చేరింది. కేశవపట్నం బస్టాండ్ ఏరియాలో వర్షం నీరు నిల్వడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కేశవపట్నం, చొప్పదండి, హుజురాబాద్, జమ్మికుంట,గంగాధర తదితర ఏరియాల్లో సైతం వర్షం కురిసింది. సాయంత్రం కురిసిన వర్షంతో వాతావరణం ఒక్కసారిగా చల్లపడింది. - కరీంనగర్ టౌన్, శంకరపట్నం, ఫొటోగ్రాఫర్ వెలుగు