
తెలంగాణలో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ములుగు జిల్లా వెంకటాపురంలో 26 గంటల్లో 36సెం.మీల రికార్డు వర్షపాతం నమోదయ్యింది. జులై 23న ఉదయం రెండు గంట్లోనే 11 సెం.మీ వర్షపాతం నమోదయ్యింది.
హైదరాబాద్‌లో రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వర్షం పడుతోంది. హైదరాబాద్ రోడ్లపై నీళ్లు నిలిచి వాహనదారుల ఇబ్బందులు పడుతున్నారు. ములుగు, జయశంకర్ భూపాలపల్లి , సూర్యాపేట్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల , మంచిర్యాల, మహబూబాబాద్, జిల్లాల్లో వర్షం దంచి కొట్టింది.
వర్షపాతం వివరాలు
- ములుగు జిల్లా వెంకటాపురం 25 సెం.మీ
- ఏటూర్ నాగారం 18 సెం.మీ
- మంగపేటలో 15 సెం.మీ
- హన్మకొండ 14 సెం.మీ
- భద్రాద్రి కొత్తగూడెం 12 సెం.మీ
- సూర్యాపేట లో 11సెం.మీ
- జయశంకర్ భూపాలపల్లి 10సెం.మీ
- ఖమ్మం, వరంగల్ 9.9సెం.మీ
- రాజన్న సిరిసిల్ల 9.6సెం.మీ
- మహబూబాబాద్ 9.6సెం.మీ
- మంచిర్యాల లో 9.5 సెం.మీ
- జగిత్యాల 9.1 సెం.మీ
Also Read : మరో మూడు గంటలు భారీ వర్షాలు..ఈ జిల్లాల వాళ్లు జాగ్రత్త..
హైదరాబాద్
- షేక్ పేట 8.6 సెం.మీ
- టోలిచౌకి 6.5సెం.మీ
- లంగర్ హౌస్ 6.2సెం.మీ
- గచ్చిబౌలి 6.1సెం.మీ
- శేర్లింగంపల్లి 5.8 సెం.మీ
- లింగంపల్లి,ఖాజా గూడా 5.2సెం.మీ
- చందానగర్, కూకట్ పల్లి, హఫీజ్ పేట్ , మియాపూర్ 4 సెం.మీ
- బహదూర్పుర , దూద్ బౌలి , మాదాపూర్, ఆఫీస్ నగర్ అత్తాపూర్ , జియాగూడ , కిషన్ బాగ్, గోల్కొండ, పటాన్చెరువు, ఆర్ సి పురం , చార్మినార్ మెహిదీపట్నం 3 సెం.మీ వర్షపాతం నమోదు