హైదరాబాద్‌‌కు మరో 72 గంటలపాటు అతి భారీ వర్ష సూచన

హైదరాబాద్‌‌కు మరో 72 గంటలపాటు అతి భారీ వర్ష సూచన

హైదరాబాద్ కు మరో 72 గంటలపాటు అతి భారీ వర్ష సూచన చేసింది వాతావరణశాఖ. కొన్నిచోట్ల 9 నుంచి 16 సెంటిమీటర్ల వర్షం పడొచ్చని తెలిపింది. దీంతో అధికారులను అప్రమత్తం చేస్తోంది GHMC. మాన్ సూన్ బృందాలు అలర్ట్ గా ఉండాలని ఆదేశించారు GHMC కమిషనర్ లోకేష్ కుమార్. లోతట్టు ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని.. ప్రజలు అవసరమైతేనే బయటకు రావాలని కోరారు. మరోవైపు నగరంలో శిథిలావస్థలో ఉన్న భవనాలకు నోటీసులు ఇచ్చి.. అందులో ఉన్నవాళ్లను ఖాళీ చేయించాలని అధికారులను ఆదేశించారు మంత్రి కేటీఆర్. అధికారులు అలర్ట్ గా ఉండాలని టౌన్ ప్లానింగ్ సిబ్బందికి సూచించారు.

హైదరాబాద్ లో ఉదయం నుంచి వర్షం కురుస్తూనే ఉంది. ఎల్బీ నగర్, ఉప్పల్, నాగోల్, బేగంపేట, కోఠి, మెహదీపట్నం, మణికొండ, బంజారాహిల్స్ లో భారీ వర్షం పడుతోంది. దీంతో రోడ్లపై చాలా చోట్ల నీళ్లు నిలిచిపోయాయి. అక్కడక్కడ ట్రాఫిక్ కష్టాలు తప్పడంలేదు