తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

తెలంగాణ తో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీగా వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. రెండు రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు భారీగా వర్షాలు కురవనున్నట్లు తెలిపింది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, రాగల 24 గంటలలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని చెప్పింది. దీని ప్రభావంతో తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలోని పలుచోట్ల ఇవాళ, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, మహారాష్ట్రలలో భారీనుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని భారత వాతావరణ విభాగం (IMD) హెచ్చరిక జారీ చేసింది. విదర్భ, కొంకణ్‌, గోవా, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్‌ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని చెప్పింది. మరోవైపు అండమాన్‌, నికోబార్‌ దీవుల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని, 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని IMD  తెలిపింది. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించింది.