10న 60 సెం.మీ. సగటు వర్షపాతం
హైదరాబాద్ : రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో సగటు వర్షపాతం భారీగా నమోదైంది. ఈ నెల 10న సగటు వర్షపాతం కేవలం 8.3 మిల్లీమీటర్లు గా అంచనా వేయగా, ఏకంగా 60.1 సెంటీమీటర్లు నమోదైంది. 11న 6 మిల్లీమీటర్లకు గాను 29.8 సెం.మీ, 12న 9.3 మిల్లీమీటర్లకు గాను 24.9 సెం.మీ రికార్డయింది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మంగళవారం అత్యధికంగా పెద్దపల్లి జిల్లా కనుకులలో 15.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని తెలిపింది. కరీంనగర్ జిల్లాలోని అర్నకొండలో 14.3, ఆదిలాబాద్ జిల్లాలోని పిప్పలధరిలో 13.7, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చేల్పూర్ లో 13.7, పెద్దపల్లి జిల్లా సుగ్లంపల్లిలో 12.9, జగిత్యాల జిల్లా ధర్మపురిలో 12 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైందని చెప్పింది.
