
అనంతపురం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. యడికి మండలంలో కుండపోత వాన పడింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పిన్నేపల్లి గ్రామంలో చెరువు తెగిపోవటంతో… ఊరంతా చెరువుగా మారింది. అటు వజ్రకరూరులో ఛాయాపురంవంక వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. కళ్యాణదుర్గంలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లల్లోకి వరద నీరు చేరింది. లక్ష్మాంపల్లెలో ట్రాక్టర్, పలు బైక్ లు కొట్టుకుపోయాయి. పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి.