ఉక్కపోత నుంచి ఉపశమనం.. పలు విమానాలు రద్దు

ఉక్కపోత నుంచి ఉపశమనం.. పలు విమానాలు రద్దు

అధిక ఉష్ణోగ్రతల నుంచి ఢిల్లీకి ఉపశమనం లభించింది. ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. భారీ వర్షం, ఈదురు గాలుల కారణంగా ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయి. హర్యానాలోనూ మెరుపులతో కూడిన కుండపోత వర్షం కురిసింది.

భారీ వర్షం కారణంగా ఢిల్లీ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన పలు విమానాలు రద్దయ్యాయి. మరికొన్ని ఆలస్యంగా బయలుదేరుతున్నాయి. దేశ రాజధాని, నోయిడా, ఘజియాబాద్‌తో సహా సమీప ప్రాంతాల్లో ఈ నెల 30వ తేదీ వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

https://twitter.com/DelhiAirport/status/1662265809048150017