LB నగర్: భారీ వర్షానికి వరదలో కొట్టుకుపోయిన మహిళ – వీడియో

LB నగర్: భారీ వర్షానికి వరదలో కొట్టుకుపోయిన మహిళ – వీడియో

హైదరాబాద్: ఆదివారం మధ్యాహ్నం దాదాపు మూడుగంటల పాటు హైదరాబాద్ లో భారీగా వర్షం పడింది. దీంతో  పట్నంలోని పలు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఎల్బీ నగర్ కాకతీయ కాలనీలో పడిన భారీ వర్షానికి ఓ మహిళ వరదలో కొట్టుకుపోతుండగా ఓ యువకుడు ఆమెను రక్షించాడు. ఈ విజువల్స్ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.

ఈరోజు పడిన వర్షానికి  లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీళ్లు వచ్చి చేరాయి. కూకట్ పల్లి, అల్విన్ కాలనీ, మియాపూర్ సహా చాలా ప్రాంతాల్లో ప్రజలు కష్టాలు ఎదుర్కొన్నారు. కొన్ని కాలనీల్లో బైక్ లు వరదకు కొట్టుకుపోయాయి.