హైదరాబాద్ లో భారీ వర్షం

హైదరాబాద్ లో భారీ వర్షం

హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. ఇవాళ మధ్యాహ్నం జూబ్లీహిల్స్‌, పంజాగుట్ట, అమీర్‌పేట, బేగంపేట, ఎల్బీనగర్‌, నాగోల్‌, కాప్రా, మన్సూరాబాద్‌, వనస్థలిపురం, బీఎన్‌రెడ్డినగర్‌, హయత్‌నగర్‌, అబ్దుల్లాపూర్‌మెట్‌, మల్కాజ్‌గిరి, నాగారం, నేరేడ్‌ మెట్‌, తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. నాలాలు పొంగి ప్రవహిస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. హైదరాబాద్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో వర్షం కురిసింది.