
హైదరాబాద్ లో వర్షం దంచి కొడుతోంది. పలు ప్రాంతాల్లో భారీ వర్షంతో పాటు వడగళ్ల వాన కురుస్తోంది. ఉప్పల్, నాగోల్, ఎల్బీనగర్, దిల్‌షుక్ నగర్, మలక్ పేట, చార్మినార్ తదితర ప్రాంతాల్లో వడగండ్లు పడ్డాయి.హైదరాబాద్ సిటీ శివారు ప్రాంతాల్లో వర్షం పడుతుంది.
ఉప్పల్ వైపు వెళ్లే రోడ్లన్నీ జలమయం అయ్యాయి. తార్నకలోని పలు చోట్ల రాళ్ల వర్షం కురుస్తోంది. వాహన రాకపోకలు నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
హైదరాబాద్ సిటీలోనే కాకుండా తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లోనూ వర్షం పడుతుంది. అసిఫాబాద్, మంచిర్యాల, మహబూబ్ నగర్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వాన కురుస్తోంది. రెండు రోజులు భారీ వర్షాలు అని వాతావరణ శాఖ ముందే హెచ్చరించిన విషయం తెలిసిందే. బయటికి వెళ్లేవాళ్లు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.