Gold Rate: సోమవారం నేలకూలిన గోల్డ్ రేటు.. హైదరాబాదులో తగ్గిన తులం రేటిదే..

Gold Rate: సోమవారం నేలకూలిన గోల్డ్ రేటు.. హైదరాబాదులో తగ్గిన తులం రేటిదే..

Gold Price Today: గతవారం వరుస పెరుగుదలతో సామాన్యులకు చుక్కలు చూపించిన గోల్డ్ రేట్లు ఈవారం మాత్రం చల్లబడ్డాయి. ప్రధానంగా ఇండియా-పాక్ మధ్య యుద్ధానికి బ్రేక్ పడుతూ రెండు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించటంతో పెద్ద ఊరట లభించింది. దీంతో పెళ్లిళ్లు, శుభకార్యాలకు కొత్తగా షాపింగ్ చేయాలనుకుంటున్న వ్యక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన రేట్లను పరిశీలించాకే షాపింగ్ చేయటం ఉత్తమం.

22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు ఏకంగా రూ.16వేల 500 తగ్గింపును నమోదు చేసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేడు తగ్గిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.8వేల 880, ముంబైలో రూ.8వేల 880, దిల్లీలో రూ.8వేల 895, కలకత్తాలో రూ.8వేల 880, బెంగళూరులో రూ.8వేల 880, కేరళలో రూ.8వేల 880, వడోదరలో రూ.8వేల 885, జైపూరులో రూ.8వేల 895, లక్నోలో రూ.8వేల 895, మంగళూరులో రూ.8వేల 880, నాశిక్ లో రూ.8వేల 883, అయోధ్యలో రూ.8వేల 895, బళ్లారిలో రూ.8వేల 880, నోయిడాలో రూ.8వేల 895, గురుగ్రాములో రూ.8వేల 895 వద్ద కొనసాగుతున్నాయి. 

ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు రూ.18వేల భారీ తగ్గుదలను చూసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో నేడు తగ్గిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను గమనిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.9వేల 688, ముంబైలో రూ.9వేల 688, దిల్లీలో రూరూ.9వేల 703, కలకత్తాలో రూ.9వేల 688, బెంగళూరులో రూ.9వేల 688, కేరళలో రూ.9వేల 688, వడోదరలో రూ.9వేల 693, జైపూరులో రూ.9వేల 703, లక్నోలో రూ.9వేల 703, మంగళూరులో రూ.9వేల 688, నాశిక్ లో రూ.9వేల 691, అయోధ్యలో రూ.9వేల 703, బళ్లారిలో రూ.9వేల 688, నోయిడాలో రూ.9వేల 703, గురుగ్రాములో రూ.9వేల 703గా ఉన్నాయి. 

►ALSO READ | Stock Market: కాల్పుల విరమణతో బుల్స్ జోరు.. భారీ లాభాల్లో సెన్సెక్స్-నిఫ్టీ..

ఇదే క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడల్లో నేడు 22 క్యారెట్ల గ్రాము బంగారం ధర రూ.8వేల 880 వద్ద కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రిటైల్ విక్రయ ధరలు తగ్గిన తర్వాత రూ.9వేల688గా విక్రయాలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో వెండి ధర కేజీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.వెయ్యి100 తగ్గి రూ.లక్ష 9వేల వద్ద కొనసాగుతోంది.