ఇన్వెస్టర్లకు కీలక సీక్రెట్ చెప్పిన మ్యూచువల్ ఫండ్ కంపెనీ సీఈవో.. ఇలా చేస్తే లాభాలే..!!

ఇన్వెస్టర్లకు కీలక సీక్రెట్ చెప్పిన మ్యూచువల్ ఫండ్ కంపెనీ సీఈవో.. ఇలా చేస్తే లాభాలే..!!

Sandeep Tandon: గడచిన వారం రోజులుగా స్టాక్ మార్కెట్లతో పాటు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లు కూడా అయోమయంలో ఉన్నారు. యుద్ధ పరిస్థితులతో మార్కెట్లు ప్రభావితం కాగా అసలు ఎలాంటి స్టాక్స్ కొనాలి, ఎలాంటి మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేయాలి అనే అయోమయం వారిని వెంటాడుతూనే ఉంది. ఇలాంటి సందర్భంలో అసలు నిపుణులు ఏమంటున్నారనే విషయాలు తెలుసుకోవటం ఇన్వెస్టర్లకు ఒక క్లారిటీని అందిస్తుంది.

వివరాల్లోకి వెళితే భారత్ పాక్ గొడవల నేపథ్యంలోనూ మార్కెట్లపై క్వాంట్ మ్యూచువల్ ఫండ్ సీఈవో సందీప్ టాండన్ సానుకూలంగానే ఉన్నారు. 2025 ప్రారంభంలో ట్రంప్ కి సంబంధించిన పరిణామాలతో భారత సెంట్రిక్ స్టాక్స్ పై ఎక్కువగా పెట్టుబడులను పెంచిన సందీప్ వెల్లడించారు. ఈ క్రమంలో హాస్పిటాలిటీ, ఇన్ ఫ్రా, పవర్, ఫార్మా, టెక్స్ టైల్, కన్జమ్షన్ రంగాల్లోని షేర్లపై బెట్ వేసినట్లు పేర్కొన్నారు. 

ఇలాంటి మార్కెట్ పరిస్థితుల్లో చాలా మంది ఫండ్ మేనేజర్లు పెద్ద ప్రైవేటు రంగంలోని బ్యాంకింగ్ షేర్లపై బులిష్ వ్యూహాన్ని కలిగి ఉండగా.. సందీప్ దీనికి దూరంగా ఉన్నారు. ఎవరైనా ప్రభుత్వం లాభాల స్వీకరణకు వెళ్లాలంటే ఈ రంగం ఓవర్ ర్యాలీని చూడటంతో బయటకు రావొచ్చన్నారు. అలాగే ఆదాయాలను పరిగణలోకి తీసుకున్ని కంపెనీలను ఎంపిక చేసుకోవటం సరైన పెట్టుబడి వ్యూహం కాదని అభిప్రాయపడ్డారు. క్వాంట్ పెట్టుబడి ప్రక్రియ ప్రవర్తనా ఫైనాన్స్, అవగాహన విశ్లేషణలపై ఎక్కువగా ఆధారపడి ఉంటుందని సందీప్ పేర్కొన్నారు.

►ALSO READ | IPO News: ఈ ఐపీవో షేర్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్స్.. గ్రేమార్కెట్లో దంచుతోంది..

ఇప్పటికే ర్యాలీతో సెలబ్రేట్ చేయబడిన కంపెనీలకు తాము దూరంగా ఉంటామని, చాలా మంది నిర్లక్ష్యానికి గురైన మంచి షేర్లలో ఇన్వెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తామంటూ సందీప్ తమ పెట్టుబడి స్ట్రాటజీ గురించి ప్రకటించారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం తాము డిఫెన్స్ రంగంలోని కంపెనీ షేర్లపై బెట్టింగ్ తగ్గించినట్లు వెల్లడించారు. దీనికి బదులుగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల షేర్లతో పాటు ఇన్ ఫ్రా రంగం వైపు మళ్లినట్లు వెల్లడించారు. అలాగే ఎక్కువ హైప్ కలిగిన కంపెనీలకు దూరంగా ఉంటామని, పెట్టుబడి ఎంపికకు మునుపు సదరు కంపెనీ ఆదాయాలు, భవిష్యత్తు గురించి తప్పక పరిగణిస్తామని సందీప్ వెల్లడించారు. ప్రస్తుతం తాము దీర్ఘకాలిక పెట్టుబడి వ్యూహంతోనే ముందుకెళుతున్నట్లు పేర్కొన్నారు.