IPO News: ఈ ఐపీవో షేర్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్స్.. గ్రేమార్కెట్లో దంచుతోంది..

IPO News: ఈ ఐపీవో షేర్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్స్.. గ్రేమార్కెట్లో దంచుతోంది..

Virtual Galaxy Infotech IPO: 2025 ప్రారంభం నుంచి దేశీయ స్టాక్ మార్కెట్లలోకి వస్తున్న ఐపీవోల సంఖ్య భారీగా తగ్గింది. దీనికి కొన్ని ప్రధాన కారణాలను పరిశీలిస్తే.. ముందుగా భారత స్టాక్ మార్కెట్లలో కరెక్షన్ ఒకటి కాగా రెండవది ఐపీవోను ఫ్లోట్ చేసేందుకు మార్కెట్లలో పరిస్థితులను యుద్ధం, ట్రేడ్ వార్ వంటి పరిస్థితులు ఆటంకంగా మారటమే.

ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది వర్చువల్ గెలాక్సీ ఇన్ఫోటెక్ కంపెనీ ఐపీవో గురించే. కంపెనీ ఐపీవో రిటైల్ పెట్టుబడిదారుల కోసం మే 9 నుంచి మే 14 వరకు బెట్టింగ్ వేసేందుకు అందుబాటులో ఉంది. ఎస్ఎమ్ఈ కేటగిరీలో వస్తు్న్న ఐపీవో తాజా ఐపీవో ద్వారా దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి రూ.93.29 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం ఏకంగా 65.70 లక్షల తాజా ఈక్విటీ షేర్లను విక్రయించాలని నిర్ణయించింది. అలాగే ఈనెల 19న కంపెనీ షేర్లు ఎన్ఎస్ఈ ఎస్ఎమ్ఈ కేటగిరీలో లిస్ట్ అవుతాయని తెలుస్తోంది. 

►ALSO READ | Gold Rate: సోమవారం నేలకూలిన గోల్డ్ రేటు.. హైదరాబాదులో తగ్గిన తులం రేటిదే..

కంపెనీ ఐపీవో కోసం తన స్టాక్ ప్రైస్ బ్యాండ్ ధరను ఒక్కో షేరుకు రూ.135 నుంచి 142గా నిర్ణయించింది. అలాగే లాట్ పరిమాణాన్ని కనీసం 1000 షేర్లుగా ప్రకటించటంతో రిటైల్ పెట్టుబడిదారులు ఇందులో పాల్గొనటం కోసం రూ.లక్ష 42వేలు ఇన్వెస్ట్ చేయాల్సి వస్తోంది. అయితే ఐపీవోకు మార్కెట్లో మంచి స్పందన లభిస్తోంది. తొలిరోజు ఐపీవో ఏకంగా 69 శాతం సబ్ స్క్రిప్షన్ అందుకోవటం దీనిని రుజువు చేసింది. అలాగే రిటైల్ ఇన్వెస్టర్ల కేటగిరీ 27 శాతం కొనుగోళ్లను చూసింది.

కంపెనీ ఇప్పటికే యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.26 కోట్ల 13 లక్షలను విజయవంతంగా సమీకరించిన సంగతి తెలిసిందే. ఇక గ్రేమార్కెట్లో ఐపీవో పనితీరును పరిశీలిస్తే ఒక్కోషేరుకు రూ.17 ప్రీమియం పలుకుతోంది. లిస్టింగ్ రోజు వరకు ఇదే కొనసాగితే స్టాక్ ఇష్యూ ధర కంటే ఎక్కువగా ప్రీమియంతో కలిపి రూ.159 వద్ద గ్రాండ్ లిస్టింగ్ నమోదు చేయవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. 

NOTE: పైన అందించిన వివరాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటి ఆధారంగా ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు తీసుకోకండి. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోల్లో పెట్టుబడులు నష్టాలతో కూడుకున్నవి. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకోవటానికి ముందుగా మీ ఆర్థిక సలహాదారులను సంప్రదించటం ఉత్తమం. మీరు తీసుకునే నిర్ణయాలకు V6 యాజమాన్యం లేదా ఉద్యోగులు ఎట్టిపరిస్థితుల్లోనూ బాధ్యత వహించరు.