ఎస్సీ వర్గీకరణ జనాభాప్రాతిపదికన జరగాలి:ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

ఎస్సీ వర్గీకరణ జనాభాప్రాతిపదికన జరగాలి:ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

కాకినాడ: ఎస్సీ వర్గీకరణ జనాభా ప్రాతిపదికన జరగాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు.రిజర్వేషన్లలో మాలలకు అన్యాయం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఎస్సీ వర్గీకరణలో ఎవరికి అన్యాయం జరిగిందో తేల్చేందుకు ఓ కమిటీ వేయాలని అన్నారు. కమీటీల ద్వారా నిర్ధారణకు వచ్చిన తరువాత మాత్రమే వర్గీకరణ చేయాలని డిమాండ్ చేశారు. 

ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడలో మాలల రణభేరి సభలో పాల్గొన్నారు తెలంగాణ చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. కొంత మంది రాజకీయ నేతలు ఓట్ల కోసమే ఈ వర్గీకరణను అంశాన్ని వాడుకుంటున్నారని విమర్శించారు. ఈ దళితులంతా సంఘటితంగా ఉండి పోరాటం చేయాలన్నారు. మాలల హక్కులను సాధించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. 

తెలంగాణలో అందరం కలిసి పోరాడుతున్నాం.. మాలలంగా ఏకతాటిపైకి వచ్చి హక్కులకోసం ముందుకు సాగాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు తగ్గిపోయే ప్రైవేట్ రంగం విస్తరించింది. ప్రైవేట్ ఉద్యోగాల్లో ,బడ్జెట్ లో కూడా జనాభాప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు.