హైదరాబాద్ లో భారీ వర్షం

హైదరాబాద్ లో భారీ వర్షం

హైదరాబాద్ : సిటీలో పలుచోట్ల శుక్రవారం వర్షం కురిసింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాధాపూర్, పంజాగుట్ట, ఖైరతాబాద్, కోఠి, ఉప్పల్, LBనగర్, సికింద్రాబాద్, అల్వాల్, కూకట్ పల్లి, నాగోల్, చింతల్, రామంతాపూర్ ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. మధ్యాహ్నం నుంచి పలు ప్రాంతాల్లో వర్షం చిన్నగా మొదలై.. సిటీ అంతటా దట్టమైన నల్ల మబ్బులు కమ్ముకున్నాయి. సాయంత్రం వేళ భారీ వర్షం పడింది.

గంట నుంచి వర్షం దంచికొట్టడంతో.. ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ జామ్ అవుతోంది. రద్దీ వేళ వర్షం పడటంతో.. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లేవాళ్లు ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఈశాన్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో సెప్టెంబర్‌ రెండో తేదీన మరో అల్పపీడనం ఏర్పడే సూచనలున్నట్లు భారత వాతావరణ విభాగం(IMD) తెలిపింది. దీని ప్రభావంతో ఈ నెల 31, సెప్టెంబర్‌ 1,2 తేదీల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని తెలిపింది IMD.