కామారెడ్డి జిల్లాలో భారీ వర్షం

కామారెడ్డి జిల్లాలో భారీ వర్షం

కామారెడ్డి, వెలుగు : జిల్లాలోని ఆయా ఏరియాల్లో శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు భారీ వర్షం కురిసింది.   మాచారెడ్డి  మండలం లచ్చాపేటలో అత్యధికంగా9.4 సెం.మీ. వర్షపాతం నమోదైంది. బీబీపేటలో 4.9 సెం.మీ., లింగంపేటలో 4.8 సెం.మీ., దోమకొండ లో 3.4. సెం.మీ., పాల్వంచ మండలం వేల్పుగొండలో 3 సెం.మీ., సెంటీమీటర్లు, నాగిరెడ్డిపేటలో 2.8 సెం.మీ, ఎల్లారెడ్డి మండలం మాచాపూర్ లో 2.6 సెం.మీ., కొల్లూరు లో 1.7 సెం.మీ., పాత రాజంపేటలో 1.4 సెం.మీ.,రామ్ లక్ష్మణ్ పల్లి లో 1 సెం.మీ. వర్షపాతం నమోదైంది.

 మిగతా ఏరియాల్లో చిరుజల్లులు పడ్డాయి. ఆయా మండలాల్లో వాగులు ప్రవహిస్తున్నాయి. చెరువులు, కుంటల్లోకి వరద నీరు చేరుతోంది. నాగిరెడ్డిపేట మండలం పోచారం ప్రాజెక్ట్​, నిజాంసాగర్ ప్రాజెక్ట్​లోకి స్వల్పంగా వరద నీరు వస్తోంది. 

601 టీఎంసీ లకు చేరిన పోచారం ప్రాజెక్ట్​ 

నాగిరెడ్డిపేట మండలం పోచారం ప్రాజెక్ట్​లో కి ఆదివారం వరకు 1.601 టీఏంసీల నీరు చేరింది.  ప్రాజెక్ట్​కెపాసిటీ 1.82 టీఎంసీలకు గాను 1.601 టీఎంసీలకు చేరింది. ఇన్​ఫ్లో 613 క్యూసెక్కులు ఉంది. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండితే నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి మండలాలకు సాగునీళ్లు అందుతాయి. 

నిజాంసాగర్ ప్రాజెక్ట్​లోకి స్వల్పంగా వరద 

నిజాంసాగర్ ప్రాజెక్టులోకి స్వల్పంగా వరద వస్తోంది. ఆదివారం 1287 క్యూసెక్కుల వరద వచ్చింది. ప్రాజెక్ట్​పూర్తిస్థాయి నీటిమట్టం 17.8 టీఎంసీలకు గాను 4.5 టీఎంసీలకు చేరింది.  ప్రాజెక్ట్​కింద ఇప్పటికే వరి నాట్లు వేశారు. తడుల కోసం మెయిన్ కెనాల్ ద్వారా 330 క్యూసెక్కుల నీళ్లు వదులుతున్నారు.