ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వర్ష బీభత్సం

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వర్ష బీభత్సం
  •     ఈదురుగాలుల కారణంగా విరిగిపడిన చెట్లు, ఎగిరిపోయిన ఇంటి పైకప్పులు
  •     మామిడి, జీడి, పొగాకు పంటలకు తీవ్ర నష్టం

అశ్వారావుపేట/భద్రాచలం, వెలుగు : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సోమవారం అకాల వర్షం బీభత్సం సృష్టించింది. అశ్వారావుపేట మండలంలో సోమవారం మధ్యాహ్నం ఒక్కసారిగా దట్టమైన మేఘాలు కమ్ముకొని భారీ ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన పడింది. గాలుల ధాటికి పట్టణంలోని నందమూరి కాలనీ, జారే కాలనీ, ఆసుపాక గ్రామాలలో ఇండ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. భారీ వృక్షాలు నేలకూలడంతో విద్యుత్‌‌‌‌‌‌‌‌ అంతరాయం ఏర్పడింది. భారీ వర్షం కారణంగా రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. మామిడి, జీడి, పొగాకు పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. భద్రాచలంలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అకస్మాత్తుగా వర్షం పడింది.