తిరుమలను ముంచెత్తిన వాన.. ఉక్కబోత నుంచి రిలాక్స్

తిరుమలను ముంచెత్తిన వాన.. ఉక్కబోత నుంచి రిలాక్స్

భగభగ మండే ఎండలు.. కాలు బయటపెట్టాలంటే మాడు పగిలిపోతుంది. ఇదీ వారం, పది రోజులుగా ఏపీ స్టేట్ లో సిట్యువేషన్. మే 18వ తేదీ మధ్యాహ్నం అనూహ్యంగా వాతావరణం మారిపోయింది. చిత్తూరు జిల్లాలో చల్లబడింది. తిరుమల కొండపై భారీ వర్షం పడింది. అప్పటి వరకు ఉక్కబోతతో ఉక్కిరిబిక్కిరి అయిన భక్తులు సేదతీరారు. అర గంట.. అంటే 30 నిమిషాలపాటు పడిన వర్షంతో.. తిరుమల కొండలపై చల్లని గాలులు వీచాయి. తడిస్తే తడిశాం.. ఎండ నుంచి రిలాక్స్ అయ్యాం అంటూ కొంత మంది భక్తులు వర్షంలో తడుస్తూనే నడుచుకుంటూ గదులకు వెళ్లారు. 

రెండు వారాలుగా తిరుమల కొండపై ఉష్ణోగ్రతలు తీవ్రంగా ఉన్నాయి. 40 డిగ్రీలపైనే ఎండ తీవ్రత ఉంటుంది. భక్తులు ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి సమయంలో అకస్మాత్తుగా పడిన వర్షానికి ఆనందం వ్యక్తం చేస్తున్నారు భక్తులు. ఉన్నట్లు ఉండి పడిన భారీ వర్షంతో తిరుమల వీధుల్లో నీళ్లు పారాయి. వర్షం కారణంగా కొండలో ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలకు తగ్గింది. భక్తులకు ఉపశమనం కలిగింది.