
యూపీని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. లక్నోలో శుక్రవారం పొద్దున భారీ వర్షం కురిసింది. అటు వారణాసి ప్రాంతంలో కూడా కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో స్కూళ్లు, కాలేజీలకు ముందు జాగ్రత్తగా సెలవులు ప్రకటించారు. పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధమని చెబుతున్నారు.