
కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. బిచ్కుంద, జుక్కల్ మండలాలు మినహాయించి మిగతా మండలాల్లో వర్షాలు పడ్డాయి. అత్యధికంగా గాంధారి మండలం లో 143.8 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదవ్వగా…తాడ్వాయి మండలంలో 93.5 మిల్లీ మీటర్ల వర్షపాతం రికార్డయ్యింది. జిల్లా మొత్తంగా 41.9 సెంటీమీటర్ల వర్షం పడిందని చెబుతున్నారు అధికారులు. భారీ వర్షాలతో…జిల్లాలోని పోచారం ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండింది. ప్రాజెక్టు పైనుంచి అలుగు పారుతుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.