హైదరాబాద్‌లో ఉరుములు.. మెరుపులతో దడ పుట్టించిన వాన

హైదరాబాద్‌లో ఉరుములు.. మెరుపులతో దడ పుట్టించిన వాన

హైదరాబాద్​సిటీ  వెలుగు : గ్రేటర్​లోని పలు ప్రాంతాల్లో సోమవారం రాత్రి ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది.  గోల్కొండలో అత్యధికంగా 2.80 సెంటీమీటర్ల వాన కురిసింది. ఈదురు గాలులకు ఖైరతాబాద్, ఇర్రమంజిల్ స్టేషన్ల మధ్యలోని ఓ బిల్డింగ్ పైనుంచి జీఏ షీట్ మెట్రో ఓవర్‌ హెడ్ పవర్ సప్లై లైన్‌పై పడింది. 

విద్యుత్​ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. చాలాసేపు మెట్రో సేవలు నిలిచిపోయాయి. రైళ్లను సింగిల్ లైన్​తో నడిపించారు. చాలా చోట్ల చెట్లు నేలకొరిగాయి. కొమ్మలు విరిగి పడ్డాయి.