
అసోంలో మళ్లీ వర్షాలు ఊపందుకున్నాయి. బర్పెటా పట్టణంలో.. భారీ వర్షం కురిసింది. దీంతో.. లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. రోడ్లపైకి భారీగా వర్షపు నీరు చేరింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అపార్ట్ మెంట్ల సెల్లార్లలోకి చేరిన నీటిని.. మోటార్ పంపులు పెట్టి బయటకు తోడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో మోకాళ్ల లోతు నీటిలో జనం అవస్థలు పడుతున్నారు.
Assam: Heavy rain lashes parts of Barpeta city pic.twitter.com/GritC1KvZm
— ANI (@ANI) August 31, 2019