న్యూఢిల్లీ:దేశరాజధాని ఢిల్లీని భారీ వర్షం కుదిపేసింది. భారీ వర్షానికి ఢిల్లీలోని పలు ప్రాంతాలు నీటి మునిగాయి. పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
2024 సెప్టెంబర్ 17న మంగళవారం సాయంత్రం కురిసిన వర్షానికి ఢిల్లీలోని నోయిడా సెక్టార్ 14, ఢిల్లీ సౌత్ ఎక్స్ టెన్షన్, ఘజియాబాద్ సహా వివిధ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కిలోమీటర్లు మేరకు వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
మరోవైపు 2024 సెప్టెంబర్ 18న కూడా ఢిల్లీలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరికలు జారీ చేసింది. గం టకు 25నుంచి -35 కి.మీ వేగం తో బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.