యూపీ, మహారాష్ట్రలో వర్ష బీభత్సం

యూపీ, మహారాష్ట్రలో వర్ష బీభత్సం

యూపీలో వర్షాలు దంచికొడుతున్నాయి. బలరామ్ పూర్ లోని రాప్తీ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో చుట్టుపక్కల గ్రామాలు తీవ్ర ఇబ్బంది పడుతున్నాయి. డేంజర్ మార్క్ ను దాటి నది ప్రవహిస్తుండటంతో బాధితులందర్నీ పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. మరోవైపు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు నదీ పరివాహక ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. రేపు కూడా వర్షాలు ఉండటంతో అధికారులు పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ముంపు ప్రభావం ఎక్కువగా ఉన్న జిల్లాల్లో సహాయక చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించారు. 

ఇటు మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో థానే జిల్లాలో జన జీవనం స్థంబించింది. మార్కెట్ యార్డ్ లోకి వరద నీరు వచ్చి చేరింది. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మరో రెండ్రోజులు వర్షాలు ఉంటాయని వాతావరణశాఖ ప్రకటించింది.