దేశవ్యాప్తంగా భారీ వర్షాలు

దేశవ్యాప్తంగా భారీ వర్షాలు

క్లౌడ్‌‌‌‌‌‌‌‌ బరస్ట్‌‌‌‌‌‌‌‌తో ఆకస్మిక వరదలు
హిమాచల్‌‌‌‌‌‌‌‌ ప్రదేశ్‌‌‌‌‌‌‌‌లో ముగ్గురు గల్లంతు
ఈ నెల 25 దాకా పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు

షిమ్లా/శ్రీనగర్/న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో ‘క్లౌడ్‌‌‌‌‌‌‌‌ బరస్ట్‌‌‌‌‌‌‌‌’తో ఆకస్మిక వరదలు పోటెత్తుతున్నాయి. దీంతో ఊళ్లకు ఊళ్లు జలమయమవుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్, లడఖ్, మహారాష్ట్ర, గుజరాత్, ఒడిశా, ఉత్తరాఖండ్, ఢిల్లీలో వాన విధ్వంసం సృష్టించింది. ఉత్తరాఖండ్‌‌‌‌‌‌‌‌లో కురుస్తున్న వర్షాలతో యమునా నదికి మరోసారి వరద పెరుగుతున్నది. దీంతో ఢిల్లీకి ముంపు ప్రమాదం పొంచి ఉన్నది. హిమాచల్‌‌‌‌‌‌‌‌లో వరదలకు ముగ్గురు గల్లంతయ్యారు. ఈ నెల 25 దాకా ఉత్తరాఖండ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, ముంబైలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. 

కొట్టుకుపోయిన దాబా.. ముగ్గురు మృతి?
హిమాచల్‌‌‌‌‌‌‌‌ ప్రదేశ్‌‌‌‌‌‌‌‌లో వరదలకు ఇద్దరు వృద్ధులు, వారి మనుమడు చనిపోయారు. రోహ్రు ఏరియాలోని బడియారా గ్రామంలో శనివారం ఉదయం ఆకస్మిక వరదలు పోటెత్తాయి. ప్రవాహం ధాటికి పలు ఇండ్లు, వాహనాలు దెబ్బతిన్నాయి. వరదల్లో ఓ దాబా కొట్టుకుపోయిందని, అందులో ఉన్న రోషన్ లాల్, భాగా దేవీ దంపతులు, వారి మనుమడు కార్తిక్ కోసం గాలిస్తున్నామని అధికారులు తెలిపారు. వాళ్లు చనిపోయి ఉండొచ్చని చెప్పారు. 

గుజరాత్‌‌‌‌‌‌‌‌లో వరద బీభత్సం
గుజరాత్‌‌‌‌‌‌‌‌లోని జునాగఢ్‌‌‌‌‌‌‌‌లో భారీ వర్షాలకు వరదలు పోటెత్తాయి. దీంతో పశువులు, వాహనాలు కొట్టుకుపోయయి. జునాగఢ్‌‌‌‌‌‌‌‌లోని పలు కాలనీల్లో కార్లన్నీ ధ్వంసమయ్యాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

లడఖ్‌‌‌‌‌‌‌‌ను ముంచెత్తిన వరదలు
శుక్రవారం రాత్రి క్లౌడ్‌‌‌‌‌‌‌‌ బరస్ట్‌‌‌‌‌‌‌‌ (ఒకే చోట హఠాత్తుగా వచ్చే భారీ వర్షం) నేపథ్యంలో లడఖ్‌‌‌‌‌‌‌‌లో వరదలు విరుచుకుపడ్డాయి. దీంతో పలు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోని బిల్డింగుల్లోకి వరద వచ్చింది.  

వరదల్లో చిక్కుకున్న 45 మంది
మహారాష్ట్రలోని యావత్మల్ జిల్లాలో వరదల్లో 45 మంది చిక్కుకున్నారు. దీంతో వారిని కాపాడేందుకు ఇండియన్ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌కు చెందిన రెండు హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి. 
పేరెంట్స్ ను కోల్పోయిన పిల్లలను దత్తత తీసుకున్న షిండే
ముంబై:  మహారాష్ర్ట ఇర్షల్వాదీ గ్రామంలో ఇటీవల కొండచరియలు విరిగిపడిన ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలను ముఖ్యమంత్రి ఏక్​నాథ్​ షిండే దత్తత తీసుకున్నారు. ఈ ప్రమాదంలో చాలామంది పిల్లలు  తమ తల్లిదండ్రులు ఇద్దరినీ కోల్పోయారు. వీరికి సీఎం షిండే గార్డియన్​గా ఉండనున్నారని ఈ మేరకు శివసేన ప్రకటించింది. కాగా, ఇర్షల్వాదీ గ్రామంలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 26కు పెరిగింది. రెస్క్యూటీమ్ లు శనివారం రోజు నాలుగు మృతదేహాలను వెలికితీసినట్లు అధికారులు తెలిపారు.  

వరదల్లో చిక్కుకున్న బస్సు.. అందరూ క్షేమం
40 మందితో వెళ్తున్న ఆర్టీసీ బస్సు నదీ ప్రవాహం మధ్యలో చిక్కుకుపోయింది. యూపీ – ఉత్తరాఖండ్ మధ్య చోటు చేసుకుందీ ఘటన. అయితే ప్రయాణికులందరూ క్షేమంగా బయటపడ్డారు. ‘‘భారీ వర్షాలతో కోటావలి నదిలో నీటి ప్రవాహం పెరిగింది. నజీబాబాద్ – హరిద్దర్ వద్ద రోడ్డుపై నుంచి వరద ప్రవహించింది. మండావలి ఏరియాలో బస్సు చిక్కుకుపోయింది. జేసీబీలు, ఇతర భారీ మిషినరీ సాయంతో 40 మందినీ కాపాడాం. బస్సును కూడా బయటికి తీసుకొచ్చాం” అని నజీబాబాద్‌‌‌‌‌‌‌‌ పోలీస్ సర్కిల్ ఆఫీసర్ గజేంద్ర సింగ్ తెలిపారు.