రాష్ట్రంలో నైరుతి రుతు పవనాలు ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. ఈసారి కొంత లేటుగా నే రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. దేశంలో అయితే ఇంకా కొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో మాన్ సూన్ ప్రభావం ఇంకా కనిపించడం లేదు.ఉత్తారాది రాష్ట్రాల్లో ఇంకా ఎండలు మండిపోతున్నాయి. రుతుపవనాల రాక, వాటి ప్రభావం ప్రతి సంవత్సరం మారుతూ వస్తుంది. షెడ్యూల్ ప్రకారం రావాల్సిన రుతు పవనాలు ఆలస్యం వస్తున్నాయి. ఒక్కోసారి విపరీతంగా అసాధారణ వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఇందుకు కారణం ఏంటీ.. ఎందుకు రుతు పవనాలు ఆలస్యం లేదా ముందు రావడం జరుగుతుంది. ఇటీవల కాలంలో రుతుపవనాల ఆగమనం ఎందుకు విపత్తులను సృష్టిస్తున్నాయి వంటి అంశాలపై ఇండో జర్మన్ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. దాదాపు పది సంవ్సతరాల పాటు పరిశోధనలు చేసి ఇండియా, ముఖ్యంగా తెలంగాణలో విషయంలో మారుతున్న వాతావరణ పరిస్థితులకు కారణాలు, వర్షాలపై అంచనాలు వేశారు.
ఇండో జర్మన్ నిపుణుల బృందం అంచనాల ప్రకారం.. తెలంగాణలో జూన్ 20 తర్వాత ఏకధాటి వర్షాలున్నాయి. ఉత్తర తెలంగాణలో జూన్ 22న తూర్పు తెలంగాణలో జూన్ 21న , తెలంగాణ వ్యాప్తంగా ఏకధాటిగా వర్షాలు కురుస్తాయని భారత జర్మనీ బృందం అంచనా వేసింది. అయినప్పటికీ తెలంగాణ వర్షం శాతం తక్కువేనని అంచనా వేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ దీనికి సంబంధించిన పోస్ట్ ను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
