హిమాచల్‌ను వదలని వర్షాలు.. 6 జిల్లాలకు భారీ వర్షాల హెచ్చరిక

హిమాచల్‌ను వదలని వర్షాలు.. 6 జిల్లాలకు భారీ వర్షాల హెచ్చరిక

 హిమాచల్ ప్రదేశ్ లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అక్కడి జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే వారి కష్టాలు ఇప్పట్లో తగ్గేట్టు కనిపించడం లేదు. మండి సహా రాష్ట్రంలోని ఆరు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. అంతేకాకుండా సిర్మౌర్‌లో వరద హెచ్చరిక జారీ చేశారు. మండి, బిలాస్‌పూర్, చంబా, కాంగ్రా, సోలన్, సిర్మౌర్ జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం  ( సెప్టెంబర్ 15) నుండి వాయువ్య భారతదేశాన్ని తాజా పశ్చిమ భంగం ప్రభావితం చేయవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో సెప్టెంబర్ 21 వరకు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దిగువ, మధ్య కొండలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు.. ఎత్తైన ప్రాంతాలలో మోస్తరు వర్షం లేదా మంచు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వర్షాల దృష్ట్యా.. రైతులు పంటలు, పండ్లకు నష్టం వాటిల్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.