బాల్కొండ సెగ్మెంట్ లో1292 ఎకరాల్లో పంటనష్టం

బాల్కొండ సెగ్మెంట్ లో1292 ఎకరాల్లో పంటనష్టం

బాల్కొండ,వెలుగు: గత మూడు రోజులుగా కురిస్తున్న భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు, బ్రిడ్జిలు, పంటలను బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి శుక్రవారం ఆఫీసర్లతో కలిసి పరిశీలించారు. మోతె, భీంగల్, బడా భీంగల్ మధ్య రోడ్లు పూర్తిగా పాడయ్యాయి. కప్పలవాగు, పెద్ద వాగు ఉదృతంగా ప్రవహించి పంటలు దెబ్బతిందని రైతులు వాపోయారు.  

1162 ఎకరాల వరి,95 ఎకరాల మొక్కజొన్న, 35 ఎకరాల సోయా పంట నష్టపోయినట్లు అగ్రికల్చర్ ఆఫీసర్లు చెప్పారు. నష్టపోయిన రైతులకు రూ.25వేల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.  బాల్కొండ హైవే వద్ద భారీ సంఖ్యలో లారీలు నిలిచిపోయాయి. కాగా వారికి భోజనాన్ని పలువురు దాతలు అందించారు