
తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత మూడు రోజులురా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వానలు పడుతున్నాయి. మరో ఐదురోజులపాటు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ముఖ్యంగా శనివారం (జూన్14), ఆదివారం తెలంగాణలోని 16 జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులలతో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది ఐఎండీ.
శనివారంనాడు.. రాష్ట్రంలో భారీవర్షాలు కురుస్తాయని ఐఎండి తెలిపింది. నిర్మల్, నిజామాబాద్, మహబూబ్ నగర్ , నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రికొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ , కామారెడ్డి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని ఎల్లో అలెర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.
ALSO READ | ఓల్డ్ సిటీ మెట్రో రైల్ పనులపై హైకోర్టు స్టే ఇవ్వలేదు: హైదరాబాద్ మెట్రో
ఇక రాష్ట్రవ్యాప్తంగా ఉరుములతో కూడిన మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలకు ఛాన్స్ ఉందంటోంది ఐఎండీ. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో గంటకు 40నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది వాతావరణ శాఖ.
మరోవైపు ఆదివారం కూడా తెలంగాణలో పలు జిల్లాల్లో భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉరుములు, మెరుపులతో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది ఐఎండీ.