హైదరాబాద్ లో మళ్లీ దంచికొడుతున్నవాన

హైదరాబాద్ లో మళ్లీ దంచికొడుతున్నవాన

వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లో వర్షం మళ్లీ దంచికొడుతోంది. ట్యాంక్ బండ్, నారాయణగూడ, హిమయత్ నగర్, బషీర్ బాగ్, ఆబిడ్స్, ఖైరతాబాద్, సైఫాబాద్ లో భారీ వర్షం కురుస్తోంది. ఎల్బీనగర్, ఉప్పల్ లో వాన దంచికొడుతోంది. ఇప్పటికే అక్కడ 1.5 సెంటిమీటర్ల వర్షం కురిసినట్లు చెప్తున్నారు అధికారులు. నాంపల్లి, కోఠి, బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్, మెహిదీ పట్నం, పెన్షన్ ఆఫీస్, పంజాగట్ట, అమీర్ పేట్ లోనూ భారీ వర్షం కురుస్తోంది. అటు నాగారం, కీసరలోనూ వర్షం పడుతోంది.  భారీ వర్షంతో అలర్ట్ అయ్యారు GHMC అధికారులు.

ఈ సీజన్ లో ఇప్పటి వరకు సాధారణం కంటే 50 శాతం ఎక్కువగా వానలు పడ్డాయి. వర్షాకాలం ముగుస్తున్నప్పటికీ ఇంకా వానలు పడుతూనే ఉన్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో మరో నాలుగు రోజులపాటు వర్షాలుంటాయని తెలిపింది వాతావరణశాఖ. ఒకటి, రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు అధికారులు.  ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్,  ఖమ్మం జిల్లాల్లో వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నారు. ఈ నెల 14న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని చెబుతోంది వాతావరణశాఖ.

రషీద్ ఖాన్ భార్య అనుష్క శర్మనా?

రోడ్డు పక్కన బంగారు నాణేలు..ఎగబడ్డ స్థానికులు

పార్టీలో నిజాయితీగా పనిచేసినందుకు అణిచివేశారు

24 గంటల్లో 66,732 కేసులు..816 మంది మృతి