దంచి కొడుతున్న వాన.. కిలో మీటర్ల కొద్ది ట్రాఫిక్​ జామ్​

దంచి కొడుతున్న వాన.. కిలో మీటర్ల కొద్ది ట్రాఫిక్​ జామ్​

హైదరాబాద్​ని కుండపోత వర్షం వణికిస్తోంది. జులై 31 సాయంత్రం నుంచి మొదలైన వర్షం ఆగకుండా కురుస్తూనే ఉంది. 

భారీ వర్షాలతో సికింద్రాబాద్, కంటోన్మెంట్,మారేడ్ పల్లి,మోండా మార్కెట్, బేగంపేట, రాణిగంజ్,బోయిన్ పల్లి, అడ్డగుట్ట, నాచారం ,మల్లాపూర్ ,ఓయూ క్యాంపస్ తార్నాక ,లాలపెట్,హబ్సిగూడా, కూకట్​పల్లి, హైదర్​గూడ, మాదాపూర్, హైటెక్​సిటీ, ప్రగతి నగర్, కేపీహెచ్​బీ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. 

ఇవాళ రాత్రి కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తం అయ్యారు. గంటల తరబడి ట్రాఫిక్​లో వెయిట్​ చేయడమే పబ్లిక్ కి పెద్ద టాస్క్ గా మారింది.