
మహారాష్ట్రలో విస్తారంగా కురిసిన వర్షాలతో నదులకు వరద ప్రవాహం పెరిగింది. బుల్ ధన ప్రాంతంలో రోడ్లపై భారీగా వరద ప్రవహిస్తోంది. నదులు, చెరువులు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. ఇళ్లల్లోకి నీరు చేరి స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
లోతట్టు ప్రాంతల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డుపై ప్రవహిస్తున్న వరద నీరు నదులను తలపిస్తుందంటున్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లే పరిస్థితి లేదంటున్నారు స్థానికులు. నిత్యావసర వస్తువులు కూడా తడిసిపోయాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.