తెలంగాణలో భారీ వర్షాలు

తెలంగాణలో భారీ వర్షాలు

హైదరాబాద్: తెలంగాణలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. మహబూబాబాద్‌ జిల్లాలో అత్యధికంగా 18.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. వరంగల్ రూరల్‌లో 13 సె.మీ.ల వర్షపాతం నమోదైంది. నిర్మల్, యాదాద్రి భువనగిరి, జనగామ జిల్లాల్లో 12 సె.మీ.ల చొప్పున వర్షపాతం నమోదవ్వగా.. పలు జిల్లాల్లో 8 నుంచి 10 సెం.మీ.ల వర్షపాతం నమోదైంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోనూ రాత్రి నుంచి ఉదయం వరకు జల్లులు పడ్డాయి.