రాగల 3 రోజుల పాటు భారీ వర్షాలు

 రాగల 3 రోజుల పాటు భారీ వర్షాలు

భారీ వర్షాల నేపథ్యంలో ఉత్తర తెలంగాణలోని 5 జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించింది. ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, జనగామ జిల్లాకు ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది. రాగల 3 రోజులు పాటు రాష్ట్రంలో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయిని వాతావరణ శాఖ వెల్లడించింది.

ఈ రోజు ఉత్తర ఒరిస్సా పరిసర ప్రాంతాల్లో అల్పపీడన ద్రోణి కొనసాగుతూ.. సగటు సముద్ర మట్టం నుంచి 5.8 కి.మీ ఎత్తుకి వెళ్లే కొద్దీ నైరుతి దిశ వైపుకి వంపు తిరిగి ఉంది. మరోవైపు ఉత్తర - దక్షిణ  ద్రోణి ఈ రోజు దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక నుంచి కొమరన్ ప్రదేశం వరకు సగటు సముద్ర మట్టం నుంచి 0.9 కి.మీ ఎత్తు వరకు కొనసాగుతుందని వాతావరణ అధికారులు తెలిపారు.

ఈక్రమంలో ఈ రోజు, రేపు రాష్ట్రంలో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలతో పాటు అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అలాగే రేపు, ఎల్లుండి రాష్ట్రంలో అక్కడక్కడా భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.