ఆకాశానికి రంధ్రం పడిందా..! హైదరాబాద్లో రికార్డు వర్షం

ఆకాశానికి రంధ్రం పడిందా..! హైదరాబాద్లో రికార్డు వర్షం

ఆగస్టు వరకు శాంతంగా ఉన్న వరుణుడు ..సెప్టెంబర్ లో ఝూళు విదల్చాడు. ముఖ్యంగా సెప్టెంబర్ 3వ తేదీ నుంచి తెలంగాణ వ్యాప్తంగా వాన దంచికొడుతోంది. ఇక సెప్టెంబర్ 5వ తేదీ అయితే..ఆకాశానికి రంధ్రపడిందా అన్నట్లు కుండపోతగా వర్షం కురిసింది. హైదరాబాద్ అంతా బీభత్సమైన వాన పడింది. అన్ని ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. 

మియాపూర్ లో అత్యధికంగా 14.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆ తర్వాత కూకట్పల్లిలో 14.3 సెంటీమీటర్లు..శేరిలింగంపల్లిలో  14 సెంటీ మీటర్ల వాన పడింది. శివరాం పల్లిలో 13 సెంటీమీటర్లు..గాజుల రామారావు లో 12.5 సెంటీమీటర్ల వర్షం దంచికొట్టింది. 

బోరబండ లో 12.5 సెంటీమీటర్లు..జీడిమెట్లలో 12.1 సెంటీమీటర్..షాపూర్, మూసాపేట్,జూబ్లీ హిల్స్ లో 12 సెంటీమీటర్లు..కుత్బుల్లాపూర్ లో 11.5 సెంటీమీటర్లు..మాదాపూర్ లో 11.4 సెంటీమీటర్లు..సికింద్రాబాద్, రాజేంద్రనగర్ లో 11.2 సెంటీమీటర్లు..బేగంపేట్, కేపీహెచ్ బీ, అల్వాల్, ముషీరాబాద్ లో 9.9 సెంటీమీటర్లు..బాలానగర్ లో 9.8 సెం మీ. గోషామహల్ లో 9.5 సెంటీమీటర్లు..మలక్పేట్ లో 9.4 సెంటీమీటర్ల వాన కురిసింది. 

ఫలక్ నుమాలో 9.2 సెంటీమీటర్లు..కార్వాన్ లో 8.8 సెంటీమీటర్లు..ఆసిఫ్ నగర్,అమీర్పేట్, నాంపల్లి ,రామచంద్రపురం 8 సెంటీ మీటర్లు, సరూర నగర్ లో 7.9 సెంటీమీటర్లు..ఎల్బీనగర్, అంబర్పేట్ లో 6.6 సెంటీమీటర్లు..మల్కాజ్గిరి, మౌలాలిలో 4.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.