మూడు రోజులు మోస్తరు వానలు

మూడు రోజులు మోస్తరు వానలు

హైదరాబాద్‌‌, వెలుగు : రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాబోయే ముడ్రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్‌‌ ఉందని హైదరాబాద్‌‌ వాతావరణ కేంద్రం తెలిపింది. కాగా శనివారం పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. టీఎస్‌‌డీపీఎస్‌‌ డేటా ప్రకారం జయశంకర్‌‌ భూపాలపల్లి జిల్లాలోని కొత్తపల్లెగోరిలో 11 సెం.మీ., మంచిర్యాలలోని తాండూరులో 8.4 సెం.మీ., ములుగులోని మల్లంపల్లిలో 8, కుమ్రంభీం అసిఫాబాద్‌‌లోని వాంకిడిలో 7.2, ఆదిలాబాద్‌‌లోని లోకరి.కె., సంగారెడ్డిలోని నారాయణఖేడ్‌‌లో 6.5 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం రికార్డయ్యింది.