హైదరాబాద్లో సమస్యాత్మక కేంద్రాలపై భారీ భద్రత

హైదరాబాద్లో సమస్యాత్మక కేంద్రాలపై భారీ భద్రత

తెలంగాణలో ఎల్లుండి (నవంబర్ 30) జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ఎలక్షన్ కమీషన్ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా హైదరాబాద్ లో ఎన్నికలకు అధికారులు భారీగా భద్రతా చేపట్టారు. బందోబస్తులో భాగంగా 70 కంపెనీల కేంద్ర, రాష్ట్ర బలగాలను.. 3 కమిషనరేట్ల పరిధిలో 40 వేల మందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈరోజు(నవంబర్ 28) సాయంత్రం నుంచి పోలింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్ విధించనున్నారు. 
 
అయితే హైదరాబాద్ లో వెయ్యి వరకు సమస్యాత్మక కేంద్రాలను అధికారులు గుర్తించారు. సమస్యాత్మక కేంద్రాల దగ్గర ఉన్న విధుల్లో కేంద్ర బలగాలు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. పోలింగ్ కేంద్రాలకు కిలోమీటర్ పరిధిలో.. ర్యాలీలు, సమావేశాలను ఎన్నికల అధికారులు నిషేధాజ్ఞలు విధించారు.