మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు.. ఆరెంజ్ అలర్ట్ జారీ

మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు.. ఆరెంజ్ అలర్ట్ జారీ

రానున్న మూడు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. గాలులు దిగువ స్థాయిలో పశ్చిమ దిశ నుంచి తెలంగాణ మీదుగా వీస్తున్నాయని.. దాంతో వర్షలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది.

2023 జులై 04 బుధవారం రాష్ట్రంలోని 12 జిల్లాల్లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావణ శాఖ సూచించింది. 2023 జులై 06 గురువారం 9 జిల్లాల్లో వానలు పడే అవకాశం ఉందని తెలిపింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాలలో అక్కడక్కడ భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. 

ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ, సిద్దిపేట, రంగారెడ్డి, నాగర్‌కర్నూల్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ ప్రకటించింది. 2023 జులై 07 శుక్రవారం చాలాచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.