
మేడ్చల్ కలెక్టరేట్, వెలుగు: ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. మేడ్చల్ నుంచి గౌడవెల్లి వెళ్లే రహదారి, మూడు చింతలపల్లి మండలం ఉద్దెమర్రి, అలియాబాద్ మునిసిపల్ పరిధిలోని రామాలయం వద్ద రహదారుల పైనుంచి వాగులు పొంగడంతో వాహనాల రాకపోకలు నిలిపివేశారు. లక్ష్మాపూర్ చెరువు అలుగు పారుతోంది.