హైదరాబాద్ విజయవాడ హైవేపై మళ్ళీ ట్రాఫిక్ జామ్.. ఐదు కిలోమీటర్లు ఎక్కడి వాహనాలు అక్కడే..

హైదరాబాద్ విజయవాడ హైవేపై మళ్ళీ ట్రాఫిక్ జామ్.. ఐదు కిలోమీటర్లు ఎక్కడి వాహనాలు అక్కడే..

నల్గొండ జిల్లా చిట్యాల దగ్గర NH 65 హైదరాబాద్ విజయవాడ రూట్లో మళ్ళీ ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఆదివారం ( నవంబర్ 2 ) చిట్యాల నుంచి పెదకాపర్తి వరకు సుమారు 5 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి. ఇవాళ సాయంత్రం కురిసిన వర్షానికి రైల్వే బ్రిడ్జి కిందికి భారీగా వర్షపు నీరు వచ్చి చేరింది. వాహనాలు ముందుకు కదలక వాహనదారులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. స్థానిక పోలీసులు, ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఈ రూట్లో తరచూ ట్రాఫిక్ అవుతుండటంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు వాహనదారులు.

వరద  నీరు నిలవడంతో బ్రిడ్జి కింది నుంచి బయటికి రావడానికి వాహనదారులు  ఇబ్బందులు పడుతున్నారు. దీంతో హైదరాబాద్  టూ  విజయవాడ హైవే 65 పై రెండు వైపులా కిలోమీటర్ల మేర భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.

రోడ్డుపై ట్రాఫిక్ జామ్ కావడంతో సొంత వాహనాల్లో, బస్సుల్లో ప్రయాణం చేస్తున్న చిన్నారులు, వృద్ధులు నరకం చూస్తున్నారు. హైవే-65 తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు కీలకమైనది. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం నుంచి ఏపీలోని నందిగామ వరకు181.50 కిలోమీటర్లు ఉంది. దేశంలోనే అత్యంత వాహనాల రద్దీ కలిగిన హైవే కావడం గమనార్హం.

►ALSO READ | పఠాన్ చెరులో భారీ అగ్ని ప్రమాదం.. రూప కెమికల్స్ లో ఎగసి పడుతున్న మంటలు..

ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా వచ్చిన చేరిన వరద నీరు తొలగించేందుకు అధికారులు ఇప్పటికీ చర్యలు తీసుకోలేదు. శనివారం పోలీసులు బ్రిడ్జి వద్దకు చేరుకుని బ్రిడ్జి కింద ఉన్నా వర్షపు నీటిని మోటార్ల సహాయంతో తరలించారు. అయినా నీరు వస్తుండడంతో బ్రిడ్జి కింద వరద నీటిలో వాహనాలు వెళ్తున్నాయి.