పఠాన్ చెరులో భారీ అగ్ని ప్రమాదం.. రూప కెమికల్స్ లో ఎగసి పడుతున్న మంటలు..

పఠాన్ చెరులో భారీ అగ్ని ప్రమాదం.. రూప కెమికల్స్ లో ఎగసి పడుతున్న మంటలు..

హైదరాబాద్ పఠాన్ చెరులో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పఠాన్ చెరు పారిశ్రామికవాడలో ఉన్న రూప కెమికల్స్ లో చోటు చేసుకుంది ఈ ఘటన. ఆదివారం ( నవంబర్ 2 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. పటాన్ చెరులోని రూప కెమికల్స్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో భారీగా మంటలు ఎగసి పడుతున్నాయి. ఘటనపై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు స్థానికులు.

స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న సిబ్బంది మూడు ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమిస్తున్నారు. ఆదివారం కావడంతో పరిశ్రమలో కార్మికులు ఎవరు లేరని తెలుస్తోంది. అయితే.. మంటలు పెద్దఎత్తున ఎగిసిపడటంతో భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు తెలుస్తోంది.

ప్రమాదం జరిగిన సమయంలో భారీగా మంటలు చెలరేగడంతో పక్కనే ఉన్న సితార ఫ్లోర్ మిల్ కు కూడా మంటలు చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే.. ఈ ఘటనలో ప్రాణనష్టమేమీ సంభవించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.