పెండింగ్ చలాన్ల పేమెంట్ వెబ్ సైట్ కు హెవీ ట్రాఫిక్

పెండింగ్ చలాన్ల పేమెంట్ వెబ్ సైట్ కు హెవీ ట్రాఫిక్
  • ట్రాఫిక్ పోటెత్తడంతో తరచూ సర్వర్ డౌన్

హైదరాబాద్: వాహనాల పెండింగ్ చలాన్ల చెల్లింపునకు భారీ రెస్పాన్స్ వస్తోంది. ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన ఈ-లోక్ అదాలత్  ద్వారా పెండింగ్ చలాన్స్ చెల్లించేందుకు వాహనదారులు క్యూ కడుతున్నారు. చాలామంది ఆన్ లైన్ లో పేమెంట్స్ చేస్తుంటే మరికొందరు.. మీ సేవ ద్వారా చెల్లింపులు జరుపుతున్నారు. మొదటిరోజే రాష్ట్రవ్యాప్తంగా 5లక్షల మంది వాహనదారులు పెండింగ్ చలాన్లు క్లియర్ చేసినట్లు తెలుస్తోంది. నిమిషానికి 700చలాన్లు క్లియర్ అవుతున్నాయంటున్నారు ట్రాఫిక్ పోలీసులు. మొదటిరోజు ప్రభుత్వానికి 5కోట్ల 50లక్షల ఆదాయం వచ్చినట్లు తెలుస్తోంది.
పెండింగ్ చలాన్ల చెల్లింపు జరిపే వెబ్  సైట్ కి ఒక్కసారిగా ట్రాఫిక్ పోటెత్తడంతో ఒక్కోసారి సర్వర్ డౌన్ అవుతోంది. పేమెంట్స్ మధ్యలోనే ఆగిపోతున్నాయని వాహనదారులు అంటున్నారు. మార్చి 31 వరకు పెండింగ్ చలాన్స్ క్లియర్ చేసుకునే అవకాశం ఉందని.. వాహనదారులు తొందరపడొద్దని పోలీసులు సూచిస్తున్నారు. బైకులు... ఆటోలకు 75 శాతం, కార్లు, లారీలకు 50 శాతం, బస్సులకు 30 శాతం రాయితీ ఇచ్చి.. మిగతా మొత్తాన్ని మాఫీ చేస్తున్నారు. దీంతో.. నెలాఖరు వరకు ప్రభుత్వానికి భారీగానే ఆదాయం వచ్చే అవకాశం ఉంది.