అడుగంటిన గోదావరి జలాలు..హెవీ వాటర్ ప్లాంట్ తాత్కాలిక మూసివేత

అడుగంటిన గోదావరి జలాలు..హెవీ వాటర్ ప్లాంట్ తాత్కాలిక మూసివేత

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక సంస్థ, ఆసియాలోనే పెద్దదైన మణుగూరు భారజల కర్మాగారంను ఈ నెల 11 సాయంత్రం నుంచి షట్‌డౌన్‌ చేశారు. నీటి వసతి లేక ప్లాంటును తాత్కాలికంగా మూసివేయడం 28 ఏళ్ల చరిత్రలో ఇది ఫస్ట్ టైం. పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్లాంటు యాజమాన్యం జిల్లా కలెక్టర్‌, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి, ముంబైలోని కర్మాగార ప్రధాన కార్యాలయ ఉన్నతాధికారులకు లెటర్లను పంపింది.
కుమ్మరిగూడెం  దగ్గర  గోదావరిపై 165 ఏళ్ల కిందట సర్‌ ఆర్దర్‌ కాటన్‌ ఆనకట్ల నిర్మించారు. ఎప్పుడూ నీరు నిల్వగా ఉంటుంది. ప్రస్తుతం ఏడాదికి 185 టన్నుల భారజలం ఉత్తత్తి అవుతుంది. కేవలం గోదావరి నిత్య ప్రవాహం ఆధారంగానే ఏర్పాటైన ఈ ప్లాంటు కోసం సముద్రమట్టానికి 45 అడుగుల లోతులో ఇన్‌ టేక్‌ వెల్‌ను నిర్మించారు. గంటకు 1800 మెట్రిక్‌ క్యూబ్‌ల జలాలను నది నుంచి రెండు మోటర్ల ద్వారా సరఫరా చేస్తుంటారు. ప్రస్తుతం గోదావరి జలాలు అందుబాటులో లేని పరిస్థితుల్లో కర్మాగారాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని శనివారం సాయంత్రం ఉన్నతాధికారులు నిర్ణయించారు. దీనికి సంబంధించి ప్రభుత్వం, కర్మాగార ఉన్నతాధికారులకు లెటర్లు పంపారు. ప్రత్యామ్నాయ చర్యలకు సహకరించాలని కోరారు.