
కుమారి 21 ఎఫ్(Kumar 21F)’లో తన క్యూట్ లుక్స్‌తో కుర్రకారును ఆకట్టుకుంది హెబ్బా పటేల్(Hebba patel). ఈ సినిమా మంచి సక్సెస్‌ను ఇచ్చినా తర్వాత ఆ క్రేజ్‌ను నిలబెట్టుకోలేకపోయింది. ఆఫర్ల సంగతి ఎలా ఉన్నా తన గ్లామర్ విషయంలో మాత్రం ఈ హీరోయిన్ ఏమాత్రం తగ్గడం లేదు. సోషల్ మీడియాలో హాట్ ఫొటో షూట్స్‌తో ట్రెండ్ అవుతుంటుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఓటీటీ సిరీస్‌లతో పాటు స్పెషల్ సాంగ్స్‌పై ఫోకస్ పెట్టింది.
తాజాగా హెబ్బా ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన ఓ పోస్ట్ ఇంట్రెస్టింగ్గా మారింది. ఓ వ్యక్తిని హగ్ చేసుకుంటూ ఉన్న ఫొటోని పోస్ట్ చేసి బాయ్‌ఫ్రెండ్ అని పరిచయం చేసింది. నిజంగానే అతను హెబ్బా బాయ్‌ఫ్రెండా లేక సరదాగా ఆటపట్టిస్తుందా అనేది క్లారిటీ లేదు. దీంతో ఆ ఫొటోలో ఉన్నది ఎవరా అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. మరి పెళ్లెప్పుడంటూ కామెంట్లు చేస్తున్నారు.