సందేహం... చచ్చినా చావని ప్రేమ

సందేహం... చచ్చినా చావని ప్రేమ

హెబ్బా పటేల్‌‌‌‌ లీడ్‌‌‌‌ రోల్‌‌‌‌లో నటిస్తున్న చిత్రం ‘సందేహం’. ‘షి బిలీవ్డ్’ అనేది ట్యాగ్ లైన్. ‘ఊరికి ఉత్తరాన’ ఫేమ్ సతీష్ పరమవేద దర్శకత్వంలో  సత్యనారాయణ పర్చా నిర్మిస్తున్నారు. లవ్ అండ్ ఎంగేజింగ్ థ్రిల్లర్‌‌‌‌‌‌‌‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో సుమన్ వూటుకూరు హీరోగా నటిస్తున్నాడు. షూటింగ్ పూర్తి చేసి, పోస్ట్ ప్రొడక్షన్ పనులతోపాటు ప్రమోషన్స్‌‌‌‌ను స్టార్ట్ చేశారు మేకర్స్. 

ఇటీవల ‘చచ్చినా చావని ప్రేమిది’ అనే లిరికల్ సాంగ్‌‌‌‌ను దర్శకుడు దశరథ్ విడుదల చేసి టీమ్‌‌‌‌కి బెస్ట్ విషెస్ చెప్పారు. సుభాష్ ఆనంద్ సంగీతం అందిస్తోన్న ఈ పాట‌‌‌‌కు పూర్ణాచారి లిరిక్స్ రాశారు. యాజిన్ నజీర్ పాడాడు.  గతంలో ఎప్పుడూ చేయని డిఫరెంట్ పాత్రని హెబ్బా పటేల్  పోషిస్తోంది అంటున్నారు మేకర్స్.  శ్వేతా వర్మ, రాశిక శెట్టి, శుభ శ్రీ రాయగురు, శ్రీనివాస్ భోగిరెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.