Heinrich Klaasen: వన్డేల్లో ద్వైపాక్షిక సిరీస్ తొలగించండి.. ఐసీసీకి క్లాసన్ డిమాండ్

Heinrich Klaasen: వన్డేల్లో ద్వైపాక్షిక సిరీస్ తొలగించండి.. ఐసీసీకి క్లాసన్ డిమాండ్

అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత సౌతాఫ్రికా విధ్వంసకర బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ టీ20 లీగ్ లు ఆడుతూ బిజీగా ఉన్నాడు. ఇటీవలే ఐపీఎల్ ముగించుకున్న ఈ సఫారీ వికెట్ కీపర్ బ్యాటర్.. ప్రస్తుతం మేజర్ లీగ్ క్రికెట్ లో సియాటెల్ ఆర్కాస్ కు  ఆడుతున్నాడు. ఈ లీగ్ తుది దశకు చేరుకుంటున్న తరుణంలో క్లాసన్ అంతర్జాతీయ క్రికెట్ లో వన్డేలపై హాట్ కామెంట్స్ చేశాడు. ఐసీసీకి తన డిమాండ్ ను తెలియజేస్తూ వన్డేల్లో ద్వైపాక్షిక సిరీస్ రద్దు చేయాలని కోరాడు. 

హెన్రిచ్ క్లాసెన్ ఇటీవల క్రిక్‌బజ్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అంతర్జాతీయ క్యాలెండర్‌లో ద్వైపాక్షిక వన్డే మ్యాచ్‌లు ఇకపై అవసరం లేదని సూచిస్తూ. బదులుగా జట్లు మరిన్ని టెస్ట్ మ్యాచ్‌లు ఆడాలని ఆయన కోరారు. " నేను కోరుకునే ఏకైక మార్పు ద్వైపాక్షిక వన్డే క్రికెట్‌ను అంతర్జాతీయ క్రికెట్ నుండి దూరంగా ఉంచడమే. ఎక్కువ టెస్ట్ మ్యాచ్‌లు ఆడని జట్లకు ఎక్కువ టెస్ట్ మ్యాచ్‌లు ఇవ్వండి. ఎక్కువ టీ20 క్రికెట్ కు ప్రాధాన్యమివ్వండి". అని క్లాసెన్ క్రికెట్ క్రికెట్ గురించి తన అభిప్రాయాలను తెలపాల్సిందిగా కోరినప్పుడు ఈ విధంగా చెప్పుకొచ్చాడు. 

సౌతాఫ్రికా వికెట్ కీపర్-బ్యాటర్ గా పరిమిత ఓవర్ల క్రికెట్ లో అదరగొడుతున్న హెన్రిచ్ క్లాసెన్ సోమవారం (జూన్ 2) అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించి ఆశ్చర్యానికి గురి చేశాడు. వైట్ బాల్ ఫార్మాట్ లో తన పవర్ హిట్టింగ్ తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసే క్లాసన్ క్రికెట్ కు గుడ్ బై చెప్పడం సంచలనంగా మారింది. 33 ఏళ్ళ క్లాసన్  సౌతాఫ్రికా తరపున 60 వన్డేల్లో 2141 పరుగులు.. 58 టీ20ల్లో 1000 పరుగులు చేశాడు. ఓవరాల్ గా తన అంతర్జాతీయ కెరీర్ లో 4 సెంచరీలు.. 16 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.      

క్లాసన్ 2024లో టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. టెస్ట్ ఫార్మాట్ లో కేవలం నాలుగు టెస్టులు మాత్రమే ఆడాడు. 2019లో రాంచీ వేదికగా భారత్‌పై అరంగేట్రం తొలి టెస్ట్ ఆడిన క్లాసన్.. 2023లో వెస్టిండీస్‌పై తన చివరి టెస్ట్ ఆడాడు. ఈ వికెట్ కీపర్ బ్యాటర్ నాలుగు టెస్టుల్లో 13 యావరేజ్ తో 104 పరుగులు చేశాడు. సిడ్నీలో ఆస్ట్రేలియాపై చేసిన 35 పరుగులు క్లాసన్ టెస్టు కెరీర్ లో అత్యధికం.