నల్గొండ జిల్లా పెద్దవూర మండలం, తుంగతుర్తి ఊరి బయట ట్రైనీ ఎయిర్ క్రాఫ్ట్ కూలింది. ఈ ఘటనలో పైలట్, ట్రైనీ పైలట్ మృతి చెందారు. మృతదేమాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. స్థానికుల సమాచారంతో పోలీసులు, రెవెన్యూ, వైద్య అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కూలినప్పుడు భారీ మంటలు వచ్చాయని స్థానికులు చెబుతున్నారు. మృతి చెందిన ట్రైనీ పైలట్ ను తమిళనాడుకు చెందిన మహిమగా గుర్తించారు. కుప్పకూలిన ఫ్లైట్ ను గుంటూరు జిల్లా, మాచర్ల కేంద్రంగా ‘ఫ్లై టెక్ కేబీయేషన్ అకాడమీ’ కి చెందినదిగా గుర్తించారు.
మరిన్ని వార్తల కోసం..
