V6 News

ట్రాఫిక్ నియమాలు పాటించాలి: డీఐజీ ఎల్ఎస్ చౌహన్

ట్రాఫిక్ నియమాలు పాటించాలి: డీఐజీ ఎల్ఎస్ చౌహన్

నారాయణపేట, వెలుగు : రోడ్డు భద్రతా నియమాలను ప్రతి ఒక్కరూ విధిగా పాటించి ప్రమాదాలను నివారించాలని జోగులాంబ జోన్-07 డీఐజీ ఎల్ఎస్ చౌహన్ పిలుపునిచ్చారు. శనివారం నారాయణపేట జిల్లా కేంద్రంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ హెల్మెట్ బైక్ ర్యాలీని కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ డాక్టర్ వినీత్‌‌‌‌లతో కలిసి ఆయన ప్రారంభించారు. మార్కెట్ యార్డ్ నుంచి శ్రీ గార్డెన్ వరకు సాగిన ఈ ర్యాలీ ద్వారా వాహనదారులకు భద్రతపై అవగాహన కల్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో డీఐజీ మాట్లాడారు.

వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపొద్దని సూచించారు. కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ యువత సమాజంలో మార్పు కోసం రోడ్డు నియమాలను అలవాటు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్​ ఎస్పీ రియాజ్ హుల్ హక్, డీఎస్పీలు, సీఐలు, ఆర్టీవో అధికారులు, విద్యార్థులు, పెద్ద సంఖ్యలో యువత పాల్గొన్నారు.